'నీటి భద్రతపై అవగాహన అవసరం'
KRNL: నీటి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో వరలక్ష్మీ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల్లో నీటి భద్రతను మెరుగుపరచడం, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ నీటి భద్రత ప్రణాళిక, పంచాయతీ స్థాయిలో సమాజ భాగస్వామ్యం అనే అంశంపై ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.