జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ATP: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం రేపు రాప్తాడులో జరగనుంది. ఈ వివాహానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. 44వ జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన వివాహ వేదిక ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, పామిడి వీరా తదితరులు పరిశీలించారు.