కొండగట్టులో మూడు రోజులపాటు అర్జిత సేవలు రద్దు

కొండగట్టులో మూడు రోజులపాటు అర్జిత సేవలు రద్దు

JGL: కొండగట్టు అంజన్న ఆలయంలో ఏప్రిల్ 1-3 వరకు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 రోజులు కేవలం కేశఖండన, మాల విరమణ, ప్రత్యేక దర్శన సేవలు మాత్రమే కొనసాగుతాయని తెలిపారు. తిరిగి ఏప్రిల్ 4 నుండి ఆర్జిత సేవలు యథావిధిగా ప్రారంభమవుతాయన్నారు.