అడ్డాకల్‌లో 28% పోలింగ్ నమోదు
MBNR: అడ్డాకల్ మండలంలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 28 శాతం నమోదైంది. మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 23,757 మంది ఓటర్లకు గాను 6,653 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమయం గడిచే కొద్దీ ఓటర్ల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు.