తిరుపతిలో ఏనుగుల బీభత్సం
AP: తిరుపతిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చిన్నగొట్టికల్లు, తుమ్మిసేనుపల్లిలో పంట పొలాలు, ఆవులపై ఏనుగులు దాడులు చేశాయి. ఈ దాడులతో స్థానిక రైతులు భయాందోళనకు గురయ్యారు. ఏడాది శ్రమించి వేసిన పంటలను ఒక్క రాత్రిలో నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నట్లు తెలిపారు.