రేపటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

రేపటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

KRNL: పెద్దకడబూరులోని గ్రంథాలయంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు లైబ్రేరియన్ అధికారి ఆశాజ్యోతి గురువారం తెలిపారు. ఈ నెల 19, 21వ తేదీలలో పలు కార్యక్రమాలు జరుపుతామన్నారు. 19న మహిళా దినోత్సవం, స్వాతంత్య్ర ఉద్యమంపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, క్రీడలు ఉంటాయన్నారు. 21న గ్రంథాలయ వారోత్సవాలు ముగుస్తాయన్నారు.