'పండుగలకు భారీ బందోబస్తు'

'పండుగలకు భారీ బందోబస్తు'

HYD: వినాయక చవితి, మిలాద్ ఉల్ నబీ పండుగల సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సుధీర్ బాబు అధికారులను ఆదేశించారు. రెండు పండుగలు ఒకే సమయంలో వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ వంటి ఏర్పాట్లను చూసుకోవాలని ఆయా శాఖల అధికారులను కోరారు.