'త్వరలోనే చెత్త డంపింగ్ యార్డ్‌ను తరలిస్తాం'

'త్వరలోనే చెత్త డంపింగ్ యార్డ్‌ను తరలిస్తాం'

ATP: రాయదుర్గం పట్టణంలోని పార్వతి నగర్ వద్ద ఉన్న కంపోస్ట్ యార్డ్‌ను త్వరలోనే వేరే చోటుకు తరలించేలా చూస్తామని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను నిన్న జేసీబీ ద్వారా తీస్తున్న తరుణంలో దుర్గంధ వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆయన దృష్టికి చేరింది. దీనిపై స్పందించి బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేయిస్తామన్నారు.