కొమరాడలో పర్యటించిన మాజీ ఉపముఖ్యమంత్రి
PPM: కొమరాడ మండలంలో శుక్రవారం మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన పార్టీ సభ్యుల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.