ఘనంగా హోలీ పండుగ వేడుకలు
MDK: తూప్రాన్ మండలంలో హోలీ పండుగ వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం చంద్రగ్రహణం సంభవించడంతో ఆదివారం, సోమవారం రాత్రులు, మంగళవారం అర్ధరాత్రి గ్రామాలలో కామ దహనం నిర్వహించారు. బుధవారం ఊరురా, తూప్రాన్ పట్టణంలో ఒకరికొకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.