'ఆగస్టు 31న ప్రజా సంకల్ప వేదిక మహాసభలు'

VZM: ఈ నెల 31వ తేదీన విశాఖపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజా సంకల్ప వేదిక ఉత్తరాంధ్ర జిల్లాల మహాసభలు జరగనున్నాయి. ఈ విషయాన్ని జిల్లా ప్రజా సంకల్ప వేదిక ఇంఛార్జ్ గోనా మానస తెలిపారు. జిల్లా హ్యూమన్ రైట్స్ విభాగం సభ్యులతో కలిసి శనివారం బొబ్బిలిలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. అన్ని విభాగాల సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.