తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు..!

తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు..!

AKP: తప్పిపోయిన 10 ఏళ్ల బాలుడు జోషిత్‌ను అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పరవాడకు చెందిన బాలుడు నూకాలమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోగా, హైవే జంక్షన్ వద్ద ఎస్సై శేషగిరిరావు గమనించారు. ఈ మేరకు బాలుడిని వివరాలు అడిగి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఎస్సైని ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ అభినందించారు.