గోశాలకు వరి గడ్డి వితరణ
KMR: భిక్కనూర్ మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వర ఆలయం వద్ద ఉన్న గోశాలకు పలువురు రైతులు ఇవాళ వరిగడ్డి వితరణ చేశారు. మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన రైతులు సిద్ధిరామిరెడ్డి, మల్లారెడ్డి తన వంతుగా 48 కట్టల వరిగడ్డిని ట్రాక్టర్‌లో గోశాలకు తీసుకొచ్చి అక్కడ సిబ్బందికి అందజేశారు. గోషాలలో ఉన్న ఆవులకు తాము వరిగడ్డి అందించామని రైతులు తెలిపారు.