మణిపూర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లర్ల బాధితులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్రం న్యాయం చేయడం లేదని నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్, బాష్యవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.