VIDEO: బొబ్బిలిలో ఆటో బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు

VZM: బొబ్బిలి మండలం పారాది వంతెన వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్ డీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీ కుమార్తెకు తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సహకారంతో బొబ్బిలి ప్రభుత్వాసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. బొబ్బిలి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.