ఉట్కూర్ PHCని తనిఖీ చేసిన కలెక్టర్

ఉట్కూర్ PHCని తనిఖీ చేసిన కలెక్టర్

NRPT: పేదలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. గురువారం ఆమె ఉట్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరిగిన ప్రసవాలు, సిబ్బంది హాజరు, మందుల సరఫరా, టీబీ పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు.