భూ కబ్జాలపై స్పందించిన ఎమ్మెల్యే
PLD: చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వంకాయలపాడు గ్రామస్థులు భూ కబ్జా ఆరోపణలు వెల్లడించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు ఐదేళ్ల అధికారాన్ని భూ కబ్జాలు, దోపిడీలకే వినియోగించారని ఆరోపించారు. సమస్యపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు.