బాబోయ్ ఎండలు.. జనం బేజారు..!

బాబోయ్ ఎండలు.. జనం బేజారు..!

VKB: పరిగి ప్రాంతంలో భానుడు భగభగలాడుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకే ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు చేరడంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ ధరించాలని వైద్యులు పేర్కొంటున్నారు.