జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్

జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్

GNTR: పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరులోని చైల్డ్ హోమ్ (అనాథ ఆశ్రమం)కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని కీర్తి జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. ఈనెల 18 నుంచి 21 వరకు జార్ఖండ్‌లో జరిగిన ఈ పోటీల్లో ఆమె ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఆశ్రమ నిర్వాహకులు, పుర ప్రముఖులు శనివారం కీర్తిని అభినందించారు.