VIDEO: చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి
VSP: సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లను హోంమంత్రి అనిత విశాఖ సీపీ శంకబ్రత బాగ్చితో కలిసి ఇవాళ పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఈవోను ఆదేశించారు. క్యూలైన్ల ఏర్పాటు, సూచిక బోర్డులు, మెడికల్ క్యాంపులు, డ్రాపింగ్ పాయింట్లను పరిశీలించారు. కంట్రోల్ రూమ్ నుంచి అప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నట్లు సీపీ తెలిపారు.