దివ్యాంగుల వద్దకే జిల్లా కలెక్టర్
నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల దివ్యాంగుల వద్దకే వెళ్లి వారి సమస్యలను స్వయంగా తెలుసుకోవడం ఆదర్శంగా నిలిచింది. వికలాంగుల సంక్షేమ సంఘం పేరుతో జిల్లాకు సంబంధం లేని ఓ వ్యక్తి అధికారులను వేధిస్తున్నాడని, దివ్యాంగులను చిన్నచూపు చూస్తున్నాడని బాధితులు కలెక్టర్‌కు వివరించారు. స్పందించిన కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.