ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్
NRPT: జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను గురువారం ఆదేశించారు. నారాయణపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి హౌసింగ్ అధికారులు, అన్ని మండలాల ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.