అమలాపురంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కోనసీమ: అమలాపురం హైస్కూల్ సెంటర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ కార్యకర్తలు, నాయకుల నడుమ ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.