నేడే నీట్ పరీక్ష..

VSP: జిల్లాలో ఆదివారం నీట్ పరీక్ష జరగనుంది. ఈ మేరకు విశాఖలో 16 పరీక్షా కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 7,344 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. గంట ముందే అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ప్రతి రెండు కేంద్రాలకు ఇంఛార్జ్ MROని, ప్రతి 8కేంద్రాలకు ఒక RDOని పర్యవేక్షకునిగా నియమించారు.