జిల్లాలో రేపు జాబ్ మేళా
GDWL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీల్లో శిక్షణ, ఉపాధి కల్పించేందుకు రేపు శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డాక్టర్ ప్రియాంక గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల కలిగి SSC, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు. ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 2:00 వరకు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.