హన్మకొండలో రోడ్డు ప్రమాదం: వర్ధన్నపేట వాసి మృతి
HNK: హన్మకొండ నగరంలోని అలంకార్ జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న కోలా శ్రీనివాస్‌ను అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడు వర్ధన్నపేట పట్టణానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.