రేపు కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం
BDK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రేపు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదివారం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ప్రజలు లిఖితపూర్వకంగా తమ సమస్యలు వెల్లడించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.