ఈనెల 20న ఉచిత కంటి వైద్య శిబిరం
ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్లో ఈనెల 20న ఎమ్మెల్యే ముక్కు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వృద్ధులకు ఉచితంగా నేత్ర పరీక్షలను నిర్వహించడంతోపాటు కంటి అద్దాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.