VIDEO: ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ
SDPT: ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇవాళ సుభాష్ రోడ్డులోని పండ్ల వ్యాపారులకు ఆయన అవగాహన కల్పించారు. రవాణాకు ఇబ్బంది కలగకుండా తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకోవాలని, రోడ్డుపై బండ్లు పెట్టవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.