NRIకు నివాళులర్పించిన ఎమ్మెల్యే
NTR: నందిగామ పట్టణం హనుమంతుపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. NRI గాడిపర్తి నవీన్ అనారోగ్యం కారణంగా యూఎస్ బోస్టన్ సిటీలో మరణించారు. ఆయన పార్థీవదేహం ఈరోజు స్వగ్రామనికి చేరుకుంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నవీన్ పార్థీవదేహాన్ని సందర్శించి, ఘన నివాళులు అర్పించారు. గ్రామస్తులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.