కబడ్డీ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
PLD: వినుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్ జిల్లా బాలురు, బాలికల కబడ్డీ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. యువత క్రీడల ద్వారా శారీరక, మానసిక ఉల్లాసం పొందడమే కాకుండా క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని ఆయన తెలిపారు.