మద్యానికి 6 కోట్ల మంది బానిస: నివేదిక
దేశంలో మద్యం సేవించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. ఇందులో 6 కోట్ల మంది మద్యానికి బానిసలుగా మారారని ఓ నివేదికలో వెల్లడైంది. వీరిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉండటం విశేషం. వీరి వయసు 18 నుంచి 49 మధ్య ఉంటుందని పేర్కొంది. దేశంలో అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల జాబితాలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది.