యువకుడిని మోసం చేసిన హీరో
జెట్టి సినిమా హీరో తనను మోసం చేశాడంటూ చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు లోకేష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. హీరో మాన్యం మురళీకృష్ణకు రూ.3.15 కోట్లు ఇచ్చానని తెలిపాడు. రైల్వే కాంట్రాక్ట్ పేరుతో హీరో మోసం చేశాడంటూ సూసైడ్ నోట్ రాశాడు. లేఖలో అమ్మానాన్న తనను క్షమించాలని కోరాడు. ఈ క్రమంలో బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రికి లోకేష్‌ను తరలించారు.