VIDEO: చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

WGL: మహిళలను గౌరవించుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆదివారం సంగెం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల పరిధిలోని మహిళలకు జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి MLA ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు.