వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు వేలం

వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు వేలం

KRNL: ఆదోని మండల పరిధిలోని పెద్దతుంబలం పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో పట్టుబడిన 11 వాహనాలను వేలం వేస్తున్నట్లు ఎస్సై డి.మహేష్ శనివారం తెలిపారు. ఈ నెల 19న స్టేషన్ ఆవరణంలో బహిరంగ వేలం జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు పోటీదారులు ఏదైనా గుర్తింపు కార్డుతో పాల్గొనవచ్చని, వేలం వేయనున్న ద్విచక్ర వాహనాలు అన్నీ స్క్రాప్ వాహనాలేనని తెలిపారు.