వీధి కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు

RR: చేవెళ్ల పట్టణ పరిధిలోని దామరగిద్దలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. దామరగిద్దలో గ్రామానికి చెందిన యాదయ్య, సునీత, ఓ బాలుడిపై దాడి చేశాయి. గ్రామంలో రాత్రి వేళ వీధిలో నడవడానికి ద్విచక్ర వాహనాలపై వెళ్లడానికి గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.