ప్లాస్టిక్ నివారించేందుకు నడుం బిగించాలి : కోమటిరెడ్డి

ప్లాస్టిక్ నివారించేందుకు నడుం బిగించాలి : కోమటిరెడ్డి

పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్‌ నివారించేందుకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మేడారం జాతరని కాలుష్యరహితంగా నిర్వహించాలనే లక్ష్యంతో పర్యావరణ సంస్థ రూపొందించిన లక్ష క్లాత్ బ్యాగ్స్‌ని హైదరాబాద్‌లోని టీహబ్‌లో మంత్రి ఆవిష్కరించారు. బ్యాగ్స్ భక్తులకు ఉచితంగా ఇస్తామని సంస్థ అధ్యక్షుడు డా హరి, సీహెచ్ భద్ర తెలిపారు.