చుట్టుగుంటలో వాహన తనిఖీలు

చుట్టుగుంటలో వాహన తనిఖీలు

GNTR: గుంటూరు చుట్టుగుంట వద్ద ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాల తనిఖీలు చేపట్టారు. శుక్రవారం వెస్ట్ ట్రాఫిక్ ఎస్సై నాగేంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బైక్ నడిపేటప్పుడు లైసెన్సు కలిగి ఉండాలని, ఆర్‌సి బుక్‌ను తీసుకొని రావాలన్నారు. మద్యం తాగి డ్రైవ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులందరూ నిబంధనలను పాటించాలని సూచించారు.