ప్రభాస్ చిత్రంలో దగ్గుబాటి హీరో?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'స్పిరిట్'. ఈ సినిమాలో దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, అభిరామ్ కెరీర్‌కు ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్‌గా మారుతుంది. మరోవైపు, కొరియా నటుడు ‘డాన్ లీ’ కూడా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.