అప్రమత్తతతో ఉండాలని పోలీసుల హెచ్చరిక

అప్రమత్తతతో ఉండాలని పోలీసుల హెచ్చరిక

WGL: వేసవి సెలవుల్లో చెరువుల్లో ఈతకు వెళ్లి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ చర్యలు చేపట్టింది. మడికొండ, బట్టుపల్లి, రామ్‌పేట, కడిపికొండ, తరాలపల్లి గ్రామాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సన్‌ప్రీత్ సింగ్ IPS ఆదేశాలు, డీసీపీ దార కవిత సూచనలతో ఈ చర్యలు జరిగాయి. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సీఐ పుల్లల కిషన్ విజ్ఞప్తి చేశారు.