ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
GDWL: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వీకరించిన 114 ఫిర్యాదులను ఏమాత్రం పెండింగ్‌లో ఉంచకుండా,నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.