బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

ప్రకాశం: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ చీమకుర్తిలో చోటుచేసుకుంది. ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియవలసి ఉంది.