అగ్ని గోళం.. అల్లాడుతున్న జనం
ATP: జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. గత రెండు రోజులుగా బానుడు అగ్నిగోళంగా మండుతున్నాయి. దీంతో జనం ఎండల తీవ్రను తట్టుకోలేక అల్లాడుతున్నారు. మునిసిపాలిటీలు, మండలాల్లోని ప్రధాన కూడళ్లు, జనాలు ఎక్కువగా కలిసే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. దాతలు, స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి మట్టి కుండలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.