'ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయాలి'
BPT: అద్దంకి పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే భవాని సెంటర్ నందు ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. దీంతో ఆ మార్గాన ప్రయాణించాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు క్రాస్ చేయాలంటే వచ్చే పోయే వాహనాలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.