SAVE RDT.. వేల మందితో కిక్కిరిసిన అనంతపురం

అనంతపురం నగరం ఆర్డీటీ లబ్ధిదారులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది RDT లబ్దిదారులు తరలి వచ్చి శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టారు. కనుచూపు మేర జనసందోహంగా కనిపించింది. SAVE RDT అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి RDTకి FCRA పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.