రాజకీయాల్లోకి షర్మిల తనయుడు?

AP: రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా కర్నూలు ఉల్లి మార్కెట్ సందర్శనకు షర్మిలతో కలిసి రాజారెడ్డి హాజరవ్వడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఈ పర్యటనతో జనంలో రాజారెడ్డికి ఎలాంటి స్పందన వస్తుందో అని ఆసక్తి కలిగిస్తుంది. కాగా, నిన్న ఆయన విదేశాల నుంచి వచ్చినట్లు సమాచారం.