'డ్రగ్స్ వద్దు బ్రో' అంటూ పోలీసుల అవగాహన

'డ్రగ్స్ వద్దు బ్రో' అంటూ పోలీసుల అవగాహన

అనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాలలో శనివారం “డ్రగ్స్ వద్దు బ్రో” పేరుతో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై బి. హనుమంతు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, వాటి దుష్పరిణామాలపై దృష్టి సారించి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు.