నరసరావుపేటలో పర్యటించిన ఎమ్మెల్యే
PLD: నరసరావుపేట నిమ్మతోటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు శనివారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వార్డులన్నీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా తమ ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు.