అమరలింగేశ్వర స్వామిని దర్శించుకున్న క్రిష్ణ

KDP: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సిద్దవటం మండలంలోని మాధవరం-1గ్రామంలో వెలసిన అమరలింగేశ్వర స్వామిని బుధవారం రాజంపేట నియోజకవర్గ పార్లమెంటు జనసేన నేత అతికారి క్రిష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి కండువా కప్పి సన్మానించారు. అనంతరం తీర్థప్రసాదాలను అందించారు.