'చంద్రబాబు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి'

'చంద్రబాబు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి'

W.G: విశాఖ ఉక్కు కార్మికులపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పెంటపాడు మండల సీపీఎం కన్వీనర్ సిరపరపు రంగారావు డిమాండ్ చేశారు. సోమవారం గాంధీ బొమ్మ కూడలిలో నిరసన చేపట్టారు. పరిశ్రమకు సొంత గనులు కేటాయించి, అప్పులు రద్దు చేయాలని కోరారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.